VIJAY | కారు డ్రైవర్ కొడుకు స్టేజీపై ఎమోషనల్!

VIJAY | కారు డ్రైవర్ కొడుకు స్టేజీపై ఎమోషనల్!
VIJAY | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీవీకే అధినేత విజయ్ సామాన్యులకు తన పార్టీలో స్థానం కల్పిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే శబరినాథన్ వేదికపై కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, ఆయన విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. శబరినాథన్ ప్రస్తుతం ఆ పార్టీ ఐటీ విభాగం బాధ్యతలను చూస్తున్నారు. అంతకుముందు విజయ్ అభిమాన సంఘాల కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేవారు. దీంతో నమ్మకస్తుడైన శబరినాథన్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.
