మద్దతుగా జోరుగా ప్రచారం..

మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న కట్టా సురేష్ కుమార్ గుప్తాకు మద్దతుగా శనివారం అవార్డు పరిధిలో యువకులు జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు .గడపగడపకు వెళ్లి కట్టా సురేష్ కుమార్ గుప్తా కౌన్సిలర్ గా గెలిచాక ఏ ఏ పనులు చేపడుతారు అనే అంశాన్ని వివరించారు. వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే ప్రణాళికను వివరించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 1వ వార్డు నుండి కట్ట సురేష్ కుమార్ గుప్తా పోటీ చేస్తున్నారని ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని విన్నవించారు .స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో 1వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని చెప్పారు.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సిసి రోడ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో సిసి రోడ్లు మురుగు కాలువల నిర్మాణం చేపడతారని వివరించారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి అదేవిధంగా తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళతారని చెప్పారు .ఒక విజన్ తో ముందుకు వచ్చిన వ్యక్తి కట్టా సురేష్ కుమార్ గుప్తా అని మంత్రి సహకారంతో మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని కోరారు. 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కట్టా సురేష్ కుమార్ గుప్తాను ఒకటవ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కట్టా జయరాం గుప్తా, బోయ రామకృష్ణ, ఆర్ .శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply