Vigilance | కోరుట్లలో విజిలెన్స్ దాడులు!

- మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు
Vigilance |కోరుట్ల, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు ఈ రోజు దాడి చేశారు. ఉదయం 11.50 గంటలకు కార్యాలయానికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, అధికారులను ఎటు వెళ్లకుండా ఆఫీసులోనే ఉండమని సూచించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇది సాధారణ తనిఖీల్లో భాగమే అని విజిలెన్స్ అధికారులు చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో ఆరు గురు విజిలెన్స్ సిబ్బంది రికార్డులను పరిశీలిస్తున్నారు. సాయంత్రం వరకూ రికార్డుల పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
