Corruption | విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు

Corruption | విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు
..విద్యార్థులు అవినీతికి దూరంగా ఉండాలి…
..విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఘనంగా ప్రారంభం…
Corruption | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : చదువుకునే వయసు నుంచి విద్యార్థుల్లో అవినీతికి దూరంగా ఉండాలని అందుకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని శ్రీ రామకృష్ణ విద్యా సంస్థలు చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) ప్రాంతీయ కార్యాలయం ఏజీఎం నరసింహారావు, బ్యాంకు ముఖ్య నిర్వాహకులు రాజశేఖర్ , శ్రీకాంత్ రెడ్డి, దివీజ్, కళాశాల విద్యా విభాగం డీన్ ఏఎస్ ప్రగతి లు పేర్కొన్నారు. బుధవారం కళాశాలలో
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల సంయుక్త కార్యక్రమం విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (Sri Ramakrishna Degree College) సహకారంతో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన తరగతులు నిర్వహించారు.విద్యార్థులు అద్భుతమైన ప్రసంగాలు చేశారు.పారదర్శకత యొక్క పాత్రను తెలియజేస్తూ, విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు.
విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అవినీతి (Corruption) గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తు పౌరులు కాబట్టి, వారు అవినీతి నియంత్రణ పద్ధతుల పట్ల బాధ్యత వహించాలని కూడా అన్నారు. విద్యార్థులు చదువుకునే జీవితం నుంచే జాగ్రత్తగా ఉంటే, భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా మారతారని సలహా ఇచ్చారు. వ్యాసరచన పోటీలో పాల్గొన్న విద్యార్థులందరినీ అభినందించారు. మొత్తం పది మంది విద్యార్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బహుమతులు లభించాయన్నారు. తమ కళాశాల విద్యార్థులను ‘స్టార్టప్’లలోకి అడుగుపెట్టేల కృషి చేసినందుకు అభినందించారు. కళాశాల లో నిర్వహించిన పోటీలకు బహుమతి ప్రదానం చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రశంసాపత్రాలను పలువురు విద్యార్థులు అందుకున్నారు.
