Victims  Emotion :  దేవుడా.. ఏం పాపం చేశాం

Victims  Emotion :  దేవుడా.. ఏం పాపం చేశాం

 మారేడుమిల్లి దుర్ఘటనలో

బాధితులు కన్నీరు మున్నీరు

( చింతూరు, ఆంధ్రప్రభ):

 దైవ దర్శన యాత్రలో  విషాదకర ఘటన సన్నివేశంలో.. అసలు ఏం జరిగింది? ఆ క్షణంలో బస్సులోని పర్యాటకులు (Strong Emotion)  అనుభవం ఏమిటీ? కళ్ల ముందే నిర్జీవంగా పడిన సన్నిహితులు.. ఆర్తనాదాలతో (Loud Cry)  ఆత్మీయుల ఆక్రందనలకు తల్లడిల్లిన బాధితుల (Victims Story)  కథనం పరిశీలిద్దాం.  అరకు నుండి భద్రాచలంలోని రాములోరిని దర్శించుకునేందకు వస్తూ తిరిగిరాని లోకాలకి 9 మంది వెళ్ళిన దుర్ఘటన పలువురుని కంట తడి పెట్టించింది.

Victims  Emotion

Victims  Emotion

ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగ  మరో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటనకు అతి వేగమే (High Speed)  కారణంగా తెలుస్తోందిది. ఈ ప్రమాదం జరగకముందే ఒకసారి బస్సు రోడ్డు ప్రక్కకి వెళ్ళిందని అప్పుడే అందరం లేచి నెమ్మదిగా వెళ్లాలని చెప్పినట్టు  యాత్రికులు అన్నారు. ఈలోపు జరగరానిది జరిగి మాతో వచ్చిన వారిని పొగోట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్‌ నెమ్మదిగా నడిపి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని  వాపొయారు.  ఈ మధ్యతరగతి జీవుల మనో వ్యథ వర్ణనాతీతం.

Victims  Emotion : మనవడికి ఏం చెప్పాలి 

వరిగిపల్లి కుమారి చిత్తూరు జిల్లా

Victims  Emotion

Victims  Emotion : మాది చిత్తూరు జిల్లా, మేము, మాకు పరిచయస్తులతో కలసి పుణ్యక్షేత్రాలు చూసేందుకు ఈ నెల 6 వ తేదిన బయలుదేరాం. పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకొని గురువారం అరకు చేరుకొని అక్కడ నుండి భద్రాచలం రాములవారిని దర్శించుకునేందకు వస్తున్నాం. రాత్రి 3.30 కి మేము ప్రయాణించే బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నా అల్లుడు వేరెళ్ల శివశంకరెడ్డి (Sun in Law) , కూతురు సునంద (Daughter)  చనిపోయారు. నా కూతురు, అల్లుడు మమ్మల్ని  విడిచి వెళ్ళిపోయారు అని రోదిస్తూ కన్నీరుమున్నీరుయింది. నన్ను ఒంటరిని చేసి నా (Dead in Front) కళ్ళముందే బస్సు ప్రమాదంలో మరణించారు. మా మనవడు ఇంటివద్ద ఉన్నాడు. వాడికి ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.

Victims  Emotion

దైవ దర్శనానికి వచ్చి ఇలా విగత జీవులు అయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. నేను స్వల్ప గాయాలపాలై చికిత్స పొందుతున్నా . ఉన్న ఒక్కకొడుకును (ILost My son)  దిక్కులేని పక్షిని చేసి రోడ్డు ప్రమాద రూపంలో దేవుడు ఇలా ఎందుకు చేశాడో అని (Victims  Emotion) కన్నీటి పర్యాంతం అయింది.   ప్రమాదంలో మావారి మేన కోడలు శ్రీకళ రి-టైర్డ్‌ టీ-చర్‌ (Rtd.Teacher) కూడా మృతి చెందింది.

Victims  Emotion : మనశ్యాంతి కోసం వచ్చాం 

అమ్ములుబాయి, మృతుడి భార్య

Victims  Emotion

Victims  Emotion : మాది చిత్తూరు జిల్లా ఇంట్లో కొడుకులు, కోడళ్ళతో పడలేక మనశ్యాంతి లేక మనశ్యాంతి (For Peace Ful Life)  కోసం వచ్చామయ్యా !. మమ్మళ్ళి దురుదృష్టం వెంటాడుతూ వచ్చింది. బస్సు ప్రమాదంలో నా భర్త ఎస్వీ నాగేశ్వరావు (Husbond) పరలోకానికి వెళ్ళాడు. నన్ను ఒంటరిదానిని చేశాడు. ఇంట్లో బాధలు భరించలేక ప్రశాంతంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకొని పర్యాటక ప్రాంతాలను తిలకించే ఆనందంగా గడుపుదామని వచ్చాం. మా ఆనందాన్ని దేవుడు ఆవిరి చేసి నా పసుపుకుంకుమలను తీసుకెళ్ళి నాకు ఈ వయస్సులు తీరని కష్టాలను, విషాదాన్ని మిగిల్చాడు. ఇక నుంచి నా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఇక నా బాధలు వర్ణాణతీతం.

Victims  Emotion : ఇద్దరం  కలసి వెళ్తాం :

 కుప్పట్ల చంద్రారెడ్డి, క్షతగాత్రుడు

Victims  Emotion

Victims  Emotion : నేను నాతోటి గోపాల్‌ రావు మేము ఇద్దరం ఉద్యోగ  విరమణ పొందిన ఉద్యోగులం. మేము ఇద్ద్దరం ఎక్కడికి వెళ్ళిన కలిసి వెళ్ళడటం అలవాటు. బస్సు ప్రమాదం ఇలా జరుగుతుందని అనుకోలేదు. ( Lost My Friend)  దైవ దర్శనానికి బయలుదేరి భద్రాచలం వస్తున్నాం. ఇంకా 80 కిలో మీటర్లు వెళితే ప్రమాదం నుండి బయట పడేవాళ్ళం. తెల్లవారుజాము 3.30 అవుతుంది నిద్రలో కొంత మంది ఉన్నారు. ఇలా బస్సు ప్రమాదం జరిగింది. నాకు మా తోటి కొలిక్‌ గోపాలరావు కూడా గాయపడ్డాడు, ఇద్దరం కలిసే వెళ్ళి వస్తాం ప్రమాదంలో ఇద్దరం బయట పడ్డాము. ఈ ఘటన చాలా విషాదం నింపింది.

Leave a Reply