Veterinary staff | జీవాలకు నట్టల మందు వేయించాలి

Veterinary staff | జీవాలకు నట్టల మందు వేయించాలి
Veterinary staff | ఊట్కూర్, ఆంధ్రప్రభ : జీవాలకు విధిగా నట్టల నివారణ మందు వేయించాలని పెద్ద జట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్, అవసరం పల్లి సర్పంచ్ ఎల్లమ్మ తిమ్మయ్య, పశు వైద్య సిబ్బంది(Veterinary staff) శివప్రసాద్ ఆంజనేయులు సూచించారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం, అవుసలోనిపల్లి గ్రామాల్లో సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ(distribution of medicines) చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మూగజీవాల సంపూర్ణ ఆరోగ్యానికి నట్టలమందు వేయించాలన్నారు. ఆయా కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్కోటి చెన్నప్ప, మాజీ ఎంపీటీసీ కిరణ్ కుమార్, వార్డు సభ్యులు సోమేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
