Venky | షూటింగ్ ఎప్పుడంటే..

Venky | షూటింగ్ ఎప్పుడంటే..
Venky, వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా లాంఛనంగా మొదలైన విషయం తెలిసిందే. నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు రచయితగా పని చేసిన త్రివిక్రమ్ తొలిసారి వెంకటేష్ ను (Venkatesh) డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వెంకటేష్ పూర్తి స్థాయిలో చేస్తున్న సినిమా ఇది. చిరంజీవి నటిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో వెంకటేశ్ ప్రత్యేక అతిథి పాత్రను పోషిస్తున్నారు. అనంతరం డిసెంబర్లో త్రివిక్రమ్ (Trivikram)సినిమా మొదలవుతుందని సమాచారం. ఈ సినిమాకు పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. నిర్మాణ సంస్థ అధికారింగా ప్రకటించలేదు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి నాయికగా నటిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
మరి కొన్ని వార్తలకు లింక్ క్లిక్ చేయండి.
https://epaper.prabhanews.com
