వెంకీ, త్రివిక్ర‌మ్ మూవీ ప్రారంభం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : విక్ట‌రీ వెంక‌టేశ్‌(Victory Venkatesh), మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేష‌న్‌లో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని వెంకీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌క‌టించారు. స్వాతంత్ర్య దినోత్స‌వం కానుక‌గా.. ఈ ప్రాజెక్ట్ ఇవాళ పూజా కార్య‌క్రామాలు జరుపుకుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఇది వెంక‌టేశ్‌కు 77వ సినిమా. త్వ‌ర‌లోనే షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్నార‌ని స‌మాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

అభిమానులు ఫుల్ ఖుషీ
కాగా, వెంకీ నటించిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ (Mallishwari’, ‘Nuvvu Nakchav)వంటి సూప‌ర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్‌ మాటల ర‌చ‌యిత‌గా ప‌ని చేశారు. ఇప్పుడు ఈ కాంబోలో మూవీ ఖాయం కావ‌డంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన‌ ‘సంక్రాంతికి వ‌స్తున్నాంస‌ (‘Sankranti Vashtamస‌)మూవీతో వెంకటేశ్ భారీ హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. దీంతో వెంకీ మామ త‌దుప‌రి సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఆత్రుత‌గా ఎదురుచూశారు. ఇప్పుడు త్రివిక్ర‌మ్‌తో మూవీ చేస్తుండ‌డంతో వారి ఆనందానికి అవ‌ధుల్లేవ్‌. ఈ కాంబో త‌ప్ప‌నిస‌రిగా సూప‌ర్ హిట్ కొడుతుంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Leave a Reply