Vemulawada – భ‌గ‌వంతుడికి లేఖ రాసి ఆత్మ‌హ‌త్య …

నీ కొడుకుకి ఇలాగే త‌ల‌రాత రాస్తావా అంటూ ప్ర‌శ్న‌
నా కలలు కూలిపోయాయి అంటూ ఆవేద‌న
వారణాసి (కాశీ) ఘాట్‌లలో దహనం చేయాలని కోరిక

వేముల‌వాడ – రాజన్న సిరిసిల్ల జిల్లా (rajanna siricill ) వేములవాడ (vemulawada ) పట్టణంలో ఓ యువకుడు ఉరివేసుకొని (hanging ) ఆత్మహత్య (suicide ) చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముదిరాజ్ వీధికి చెందిన దీటి రోహిత్ (23) (rohit ) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు రోహిత్ ఓ సూసైడ్ నోట్ రాసి ఉంచాడు. అందులో అతను వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు, విఫలమైన ఆశల గురించి విచారం వ్యక్తం చేశాడు. “నీ కొడుకు అయితే వాని తలరాత ఇలానే రాస్తావా?” అంటూ భగవంతుడిని ప్రశ్నిస్తూ వ్రాసిన వాక్యం, నోటులోని కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ మాటలు అతని జీవితంలోని నొప్పిని, అసహనాన్ని చాటిచెప్పుతున్నాయి.

“నా కలలు కూలిపోయాయి…” అని.. ఆత్మహత్యా లేఖలో రోహిత్ ఇలా పేర్కొన్నాడు.. “My dream of writing the best suicide letter has come true by God’s grace, but living my dreams, of what I thought, had collapsed.” అంటే, జీవితం పట్ల గల ఆశలు తారుమారైనట్టు తాను చెబుతున్నాడు. తాను పలు ప్రయత్నాలు చేసినా జీవితం విజయవంతంగా సాగలేదని, జీవించడానికంటే చనిపోవడమే తక్కువ నొప్పిగా అనిపిస్తోందని రాసుకున్నాడు.

సూసైడ్ నోట్ చివర్లో తన తుది కోరికను కూడా వ్యక్తం చేశాడు. “My last wish is to burn my physical body in ghats of Kashi” అని రాసి, తన మృతదేహాన్ని వారణాసి (కాశీ) ఘాట్‌లలో దహనం చేయాలని కోరుకున్నాడు. ఈ వాక్యం అతని ఆధ్యాత్మికత, అంతిమ శరణాగతి పట్ల ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది. ఇక.. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Leave a Reply