Vemulawada | బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయంలో భక్తజనం

Vemulawada | బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయంలో భక్తజనం
- 25వేల బోనాలు సమర్పించుకున్న భక్తులు
Vemulawada | వేములవాడ, ఆంధ్రప్రభ : దక్షిణ కాశిగా విరజుల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఈ రోజు భక్తజనంతో కిక్కిరిసింది. రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే భక్తులు నెత్తిన బోనాలు ఎత్తి డప్పు చప్పుళ్ళు, నృత్యాలు చేస్తూ మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్లి భక్తిశ్రద్ధలతో శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలను సమర్పించుకున్నారు. సుమారు 25వేల మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించినట్లుగా ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు.
