Veldanda | ప్రముఖ సాహిత్య వేత్త ఇకలేరు

Veldanda | ప్రముఖ సాహిత్య వేత్త ఇకలేరు

Veldanda | వెల్దండ, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, గాయకులు, రేడియో విఖ్యాత నాటకకర్త, రచయిత, సాహిత్య వేత్త, విశ్రాంత అధ్యాపకులు రుక్మాందర్ రెడ్డి ఇవాళ‌ ఉదయం కన్నుమూశారు. సాహిత్య చరిత్రలో పండిత కవిగా పేరుగాంచిన ఆయ‌న‌ మృతిచెందడం పట్ల గ్రామస్తులు సాహిత్యానికి తీరనిలోటని గుర్తు చేశారు.

ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాల‌కు చేర్చిన తెలుగు భాష వేత్త, అజాతశత్రువు, తన వ్యక్తిత్వానికి సాటిరాని మహోన్నత వ్యక్తిత్వం వున్న మహనీయుడు, రాష్ట్రస్థాయిలో ఎన్నో సార్లు ఎన్నో శ్లోఖాలు చదివిన ధీరుడు, ఎన్నో పుస్తకాలు, పద్యాలు రాసిన రచయిత, వెల్డండ ముద్దుబిడ్డ, ఉపాధ్యాయ నిస్వార్థానికి నిదర్శనం రుక్మాందర్ రెడ్డి అని గ్రామస్తులు గుర్తు చేసుకుంటూ దిగులు చెందారు.

Leave a Reply