Veldanda | పార్టీలు కాదు.. గ్రామాభివృద్ధే లక్ష్యం…
- ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం…
Veldanda | వెల్దండ, ఆంధ్రప్రభ : కంటోనీపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని స్పెషల్ ఆఫీసర్ మోహన్ లాల్, పంచాయతీ సెక్రెటరీ ఫయాజ్ ఆధ్వర్యంలో ఇవాళ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈసందర్భంగా గ్రామ సర్పంచ్ మమత లక్ష్మణస్వామి మాట్లాడుతూ… నూతనంగా తనతో పాటు ఎన్నికైన ఉప సర్పంచ్ శివప్రసాద్, వార్డు సభ్యులకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని నూతన సర్పంచ్ కంఠం మమత లక్ష్మణస్వామి అన్నారు. నూతనంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గ్రామ ప్రజలు తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను ప్రభుత్వ సహకారంతో గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తనతో పాటు ఎన్నికైన ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు, గ్రామ ప్రజలకు మరొక్క సారి ధన్యవాదాలు తెలిపారు.

