vehicles seizure | ఊట్కూర్‌లో విస్తృతంగా వాహనాల తనిఖీ

vehicles seizure | ఊట్కూర్‌లో విస్తృతంగా వాహనాల తనిఖీ

  • నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవు.. ఎస్సై రమేష్.

vehicles seizure | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నారాయణపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఊట్కూర్ మండల పరిధిలో ఈనెల 31న బుధవారం రాత్రి విస్తృతంగా వాహనాల తనిఖీ(check) చేపట్టనున్నట్లు ఎస్సై రమేష్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు.

కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఊట్కూర్ మండల ప్రజలు, యువత పోలీసుల విజ్ఞప్తి మేరకు రాత్రివేళ కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపిన, మైనర్లు డ్రైవింగ్ చేసిన, బైక్ రేసింగ్(Bike racing) చేసిన వారిపై కేసు నమోదు చేసి వాహనాలు సీజ్(vehicles seizure) అయినట్లు వెల్లడించారు.

వేడుకలకు ఎవరైనా డీజేలను ఉపయోగించడం, అనుమతులు లేకుండా రాత్రివేళ పార్టీలను నిర్వహిస్తే డీజే లను సీజ్ చేయడంతో పాటు చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రజలు నూతన సంవత్సర వేడుకలు శాంతియుత వాతావరణం లో జరుపుకొని పోలీసులకు సహకరించాలని కోరారు.

Leave a Reply