Vehicle inspections | ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు
- తాండూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ దేవయ్య
Vehicle inspections | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఎన్నికల నేపథ్యంలో భాగంగా తాండూర్ సర్కిల్ పరిధిలో వాహనాల తనిఖీలు(Vehicle inspections) నిర్వహించినట్లు ఇన్ స్పెక్టర్ దేవయ్య తెలిపారు. ఈ రోజు రాత్రి తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై కిరణ్ కుమార్, సిబ్బందితో కలిసి ఐబీ అండర్ బ్రిడ్జ్ సమీపంలో కలిసి వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందుగా ఎలాంటి అశాంతి పరిస్థితులు రాకుండా ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ(election process) పూర్తయ్యే వరకు ప్రతిరోజూ ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో 100 నెంబర్కు కాల్ చేయాలని న్ స్పెక్టర్ దేవయ్య సూచించారు.

