బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం..

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం..
వర్గంటి రాంమోహన్ గౌడ్‌కు శుభాకాంక్షలు…
మేడ్చల్, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఇటీవల నియమితులైన తుప్రాన్ మాజీ వైస్ ఎంపీపీ వర్గంటి రాంమోహన్ గౌడ్‌ను బిజెపి శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు, ఎల్లంపేట్ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎల్లంపేట్ జగన్ గౌడ్, కుచారం మాజీ సర్పంచ్ మరియు మెదక్ జిల్లా యువమోర్చా మాజీ అధ్యక్షులు బుల్లెట్ రాజు, మనోహరాబాద్ మండల బీజేపీ మాజీ అధ్యక్షులు నరేందర్ చారి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, బిజెపి ప్రధాన కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో రాంమోహన్ గౌడ్‌కు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ఆయన సారథ్యంలో కలిసి పనిచేస్తామని నాయకులు పేర్కొన్నారు.
