Varanasi | రిలీజ్ డేట్ ఇదే..

Varanasi | రిలీజ్ డేట్ ఇదే..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ, క్రేజీ మూవీ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి అప్ డేట్స్ కోసం మహేష్ బాబు అభిమానులే కాదు.. సినీ అభిమానులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు కానీ.. ఇప్పుడు ఓ డేట్ మాత్రం వైరల్ అవుతోంది. అంతే కాకుండా.. జక్కన్న ప్లాన్ అదిరింది అంటూ నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. జక్కన్న ఏం ప్లాన్ చేశాడు..? వైరల్ అవుతోన్న వారణాసి రిలీజ్ డేట్ ఎప్పుడు…?
Varanasi | హాలీవుడ్ ఆడియన్స్ సైతం..

ఇప్పుడు సినిమా తీయడం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రమోట్ చేయడం మరో ఎత్తు. అయితే.. జక్కన్నకు ఇదంతా బాగా తెలుసు కాబట్టి.. సినిమాను షూట్ చేస్తున్నప్పటి నుంచే ప్రమోషన్స్ చేస్తుంటారు. రిలీజ్ టైమ్ కి ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తుంటారు. అలా చేయడం వలనే బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో చరిత్ర సృష్టించారు. ఆర్ఆర్ఆర్ మూవీతో హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మెప్పించడంతో ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం హాలీవుడ్ ఆడియన్స్ సైతం ఎదురు చూస్తున్నారు. దీనిని బట్టి ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Varanasi | వారణాసిలో పోస్టర్లు..

వారణాసి మూవీ టైటిల్ అండ్ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు ఈ చిత్రాన్ని 2027 వేసవికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ.. రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. జక్కన్న ముందుగా ప్లాన్ చేసిన డేట్ కి ఒక్కోసారి సినిమాలు రిలీజ్ చేయలేదు. కానీ.. ఈసారి మాత్రం అంతా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ క్రేజీ మూవీని రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసినట్లుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 7 ఆ డేట్ అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కారణం ఏంటంటే.. తాజాగా వారణాసిలో వెలసిన పోస్టర్లు ఈ దిశగా సంకేతాలు ఇస్తున్నాయి.
Varanasi | జక్కన్న మార్క్ ప్రమోషన్..

In Theatres, 7 April 2027 అంటూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రెడీ చేసి నగర వ్యాప్తంగా పెట్టారు. ఆ ప్లెక్సీల్లో అంతకుమించి వివరాలు ఏమీ లేవు. అయితే.. ఆ పోస్టర్ల డిజైనింగ్ చూస్తే.. వారణాసిని గుర్తుకు తెచ్చేలాగే ఉన్నాయి. ఇది వారణాసిలో పెట్టించారని.. ఇది జక్కన్న మార్క్ ప్రమోషన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రమోషన్ ఏ రేంజ్ లో ఉంటుదో మనందరికీ తెలిసిందే. మరి.. త్వరలోనే జక్కన్న ఈ ప్రచారం పై.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

