Chennur | సామూహిక వందేమాతర గీతాలాపన

Chennur | సామూహిక వందేమాతర గీతాలాపన
Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : వందేమాతర గీతం 150వసంతోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం చెన్నూర్ (Chennur) నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులచే సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ (BJP) జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ, బీజేవైఎం నాయకులు జాడి తిరుపతి, రాపర్తి వెంకటేశ్వర్లు, తుమ్మ శ్రీపాల్, మాణిక్ రౌత్ శంకర్, శివక్రిష్ణ, తదితరులు ఆర్ఎస్ఎస్, సంఘ్ సభ్యులు పాల్గొన్నారు.
