MOPIDEVI| మోపిదేవి, ఆంధ్రప్రభ : అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో పులిగడ్డ మామిడి తోటలో గురువారం వన సమారాధన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాద్( చిన్ని), ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, నియోజవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, సినీ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు, అవనిగడ్డ ఏఎంసీ చైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు, ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్ తో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు అందరూ ఐక్యమత్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మంచి విషయమని అన్నారు. టీడీపీకి కంచుకోటైన అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి నేతలు కార్యకర్తలు భారీ స్థాయిలో ఇక్కడికి రావడం ఆనందంగా ఉందని తెలియజేశారు.

