ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః రియాసి (జమ్మూ కాశ్మీర్) వైష్ణో దేవి(Vaishno Devi) యాత్రకు వరుసగా 20వ రోజూ ఆటంకం తప్పలేదు. ఈ యాత్ర నిరవధిక వాయిదా పడింది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన వైష్ణోదేవీ భక్తుల(To the devotees)కు నిరాశ ఎదురైంది. వైష్ణోదేవీ ఆలయానికి దారులన్నీ మూసి వేసినట్టు ఆదివారం(Sunday) శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు (SMVDSB) ప్రకటన జారీ చేసింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న కారణంగా.. ఆదివారం (సెప్టెంబర్ 14 నుంచి) ప్రారంభం కావాల్సిన శ్రీ మాతా వైష్ణో దేవి యాత్రను తదుపరి ఉత్తర్వు వెలువడే వరకూ వాయిదా వేశారు. అధికారిక వెబ్ సైట్ ఆధారంగా తదుపరి సమాచారం తెలుసుకోవాలని అభ్యర్థించారు. నిరంతర వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, పుణ్యక్షేత్రానికి దారులన్నింటిని రద్దు చేయటంతో యాత్రికుల రాకపోకలు సురక్షితం కాదని అధికారులు స్పష్టం చేశారు.
విరిగి పడుతున్న కొండచరియలు
కొండచరియలు విరిగిపడి, రోడ్డు మార్గం దెబ్బతినడంతో జమ్మూ-శ్రీనగర్(Jammu-Srinagar) జాతీయ రహదారి పై అనేక చోట్ల అంతరాయం కలిగింది. ఇది కనెక్టివిటీని మరింత క్లిష్టతరం చేసింది. సుదీర్ఘ అంతరాయంతో భక్తులలో నిరాశ అనివార్యమైంది. యాత్రపై ఆధారపడిన స్థానిక వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఆగస్టు 26న కొండచరియలు విరిగిపడి 34 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ స్థితిలో వైష్ణో దేవి యాత్రను నిలిపివేశారు.
నేషనల్ హైవే దిగ్బంధనం
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భారీ వర్షంతో అధ్కువారి వద్ద ఉన్న ఇంద్రప్రస్థ భోజనాలయ సమీపంలో కాట్రా నుంచి పుణ్యక్షేత్రానికి వెళ్లే 12 కిలోమీటర్ల దూరంలో భారీగా కొండచరియలు విరిగిపడిన విషయం విధితమే.