Vaishnavi | మరో ముగ్గురు అరెస్ట్

Vaishnavi | మరో ముగ్గురు అరెస్ట్
Vaishnavi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు రోజురోజుకు సంచలన మలుపులు తిరుగుతోంది. మొదట ఇది వ్యక్తిగత విభేదాల కోణంలో కనిపించినా, దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దశలవారీగా ముందుకు సాగుతున్నారు.
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇప్పటికే భర్త హరిబాబును అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా అతని తల్లితో పాటు ఇద్దరు అన్నలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించారు.
ఈ అరెస్టులతో కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, కుట్ర ఏ స్థాయిలో జరిగిందన్నదిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
