వ్యాధి నివారణ టీకాలు వేయించాలి..

వ్యాధి నివారణ టీకాలు వేయించాలి..
- 66వ డివిజన్ కార్పొరేటర్ శివకుమార్
హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; పాడి రైతులు సత్వరంగా గాలికుంటు వ్యాది నివారణ టీకాలు వేయించి, పశు సంపదను కాపాడుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ సూచించారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో పశువైద్యాధికారి మాళవిక ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శివకుమార్ మాట్లాడుతూ.. రైతు సోదరులందరూ తమ పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత టీకాల కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. పశువుల పెంపకందారులు గాలికుంటు వ్యాది నివారణ పట్ల ఎల్లవేళలా అప్రమత్తంగా ఉఃడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మారం తిరుపతి, బీజేపీ నాయకులు తాళ్ల శ్యామ్, మట్టెడ సుమన్, పశువైద్య శాఖ సిబ్బంది సాధిక్, రాధా తదితరులు పాల్గొన్నారు.
