Uyyur | కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి..

Uyyur | ఉయ్యూరు – ఆంధ్రప్రభ : ఉయ్యూరులో వేంచేసి ఉన్న శ్రీ జగదాంబ సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకకు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు విచ్చేసి స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరు శివాలయం దేవాలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నదని, శ్రీ జగదాంబ సమేత సోమేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, సీడీసీ చైర్మన్ రాజులపాటి రామచంద్ర రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, ఆలయ కమిటీ చైర్మన్ నందన్ కిషోర్, పల్లి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.
