Utnoor | ఐటీడీఏ మ‌హాధ‌ర్నా

Utnoor | ఐటీడీఏ మ‌హాధ‌ర్నా

అట‌వీశాఖ అధికారుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు


Utnoor | ఉట్నూర్, ఆంధ్ర‌ప్ర‌భ : పీఎం జన్మన్ ఇండ్ల (PM Janman houses) నిర్మాణాలను అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారుల‌కు వ్య‌తిరేకంగా ఈ రోజు ఉట్నూర్ ఐటీడీఏ కార్యాల‌యం ఎదుట మ‌హా ధ‌ర్నా చేశారు. ఈ ధర్నాకు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, బీజేపీ నాయకులు తుడుం దెబ్బ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

అడవులలో ఉండే గిరిజనులకు అటవీశాఖ అధికారులు దౌర్జన్యాలు చేయడం అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం (State Government) తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కోలాం సంఘం రాష్ట్ర అధ్యక్ష గౌరవ అధ్యక్షులు కొడప సోనే రావు, టెకం లక్ష్మణ్ మాట్లాడుతూ మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే కోలాం గిరిజనులకు పీఎం జనరల్ పథకం ద్వారా కోట్లాది రూపాయలు ఇండ్ల నిర్మాణం కోసం మంజూరు చేస్తే అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్నాకు పెద్ద సంఖ్యలో కోలాం గిరిజనులు రావడంతో ఉట్నూర్ సీఐ (Utnoor CI) మడావి ప్రసాద్, ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలోకోలాం సంఘం జిల్లా అధ్యక్షులు కుమ్ర రాజు,మాడావి గోవిందరావు, కుమ్రం సూరు యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి టేకం భీము, ఉమ్మడి జిల్లాల కోలాం సంఘ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, గ్రామ పటేళ్లు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply