Utnoor | స్వర్గీయ ఎస్సై తానాజీ సేవలు మరువలేనివి

Utnoor | స్వర్గీయ ఎస్సై తానాజీ సేవలు మరువలేనివి

  • నివాళులర్పించిన లంబాడ జేఏసి నాయకులు

Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన స్వర్గీయ రాథోడ్ తానాజీ వృత్తి రీత్యా సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి, సామాజిక పరంగా సమాజం కోసం కూడ తనవంతు కృషి చేశాడని, లంబాడి జేఏసీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది బానోత్ జగన్ నాయక్, ఉపాధ్యక్షుడు నేతావత్ రాందాస్ నాయక్, చవాన్ యశ్వంత్ రావు, భానోత్ రామారావు, లంబాడి జేఏసీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు రాథోడ్ శేష రావు ఆడే, సురేష్ తదితరులు పేర్కొన్నారు. ఈ రోజు ఉట్నూరు పట్టణంలోని ఫకీర్ గుట్టకు చెందిన తానాజీ మొదటి సంవత్సరిక కార్యక్రమం ఉట్నూర్ మండలంలోని కొత్తగూడ వారి చేనులో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులతోపాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొని సమాధికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… మనిషి అన్న తర్వాత చావు పుట్టుకలు సహజమని, మనిషి బతికిన రోజులు తన కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతూనే, సామాజిక కార్యక్రమాలు పాల్గొని సమాజ సేవ చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజ్మీర భీమ్లాల్ నాయక్, రాథోడ్ జయరాం, రాథోడ్ రోహిదాస్, రాథోడ్ అమర్ కుమార్, డాక్టర్ రాథోడ్ విజయ్ కుమార్, జాదవ్ కైలాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేంపల్లి, భానోత్ మోహన్, పవర్ విజయ్ కుమార్, పవర్ దేవదాస్, రాథోడ్ మహేందర్, పవర్ మోహన్, ఉద్యోగులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply