Utnoor | ఏజెన్సీలో ఆధునిక వైద్య సేవలు ఎంతో ముఖ్యం

Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ ఏజెన్సీలో అదనపు వైద్య సేవలు ఎంతో అవసరమని వెనుకబడిన ఈ ప్రాంతంలో ప్రైవేటు ఆసుపత్రిలో వాళ్లు సేవలందించడం సంతోషకరమని బీజేపీ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తనయుడు రితీష్ రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని తిరుమల ఫంక్షన్ హాల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన థైరోకేర్ సెంటర్ ను ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రితిష్రాథోడ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన పరీక్షలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేందర్ భాజపా ఉట్నూర్ మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, ఎస్టి మోర్చా జిల్లా కార్యదర్శి రాథోడ్ శేషారావు, కిషన్ పటేల్ రాహుల్, తదితరులు పాల్గొన్నారు.
