Utnoor | ఘనంగా జాతర వేడుకలు ప్రారంభం

Utnoor | ఘనంగా జాతర వేడుకలు ప్రారంభం

  • బారులు తీరిన భక్తులు

Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని సాలెవాడ (కే) గ్రామంలో ఉన్న శ్రీక్షేత్ర శివ కైలాసం ‘హర హర మహాదేవ్’ దేవస్థానంలో ఆదివారం జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర ప్రారంభోత్సవానికి వందలాది మంది భక్తులు (Devotees) తరలివచ్చారు. ఆలయంలో భక్తులు బారులు తీరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రతి ఏడాది పుష్య మాసంలో వారం రోజుల పాటు ఈ జాతర వేడుకలు నిర్వహిస్తారు. ఈ మేర‌కు ఆలయ నిర్వాహకులు, మాజీ ఎంపీటీసీ సాల్గేర్ రవీందర్ (Ravinder) తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు జాతర ఉత్సవాలు కొనసాగుతాయని ఆయ‌న‌ పేర్కొన్నారు.

ఈ జాతర వేడుకల్లో ఉట్నూర్, గుడిహత్నూర్, ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి (Indravelli) మండలాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వేడుకల సందర్భంగా ఏడవ రోజు దహీహండీ కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయని వారు వెల్లడించారు.

Leave a Reply