Utnoor | ఆశీర్వదిస్తే.. సమస్యలు పరిష్కరిస్తా

Utnoor | ఆశీర్వదిస్తే.. సమస్యలు పరిష్కరిస్తా

  • ఉట్నూర్ సర్పంచ్ అభ్యర్థి భానోత్ సంగీత

Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ప్రజలు ఈసారి ఎన్నికల్లో ఆశీర్వదించి ఆదరిస్తే పంచాయతీ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఉట్నూర్ పంచాయతీ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోత్ సంగీత హామీ ఇచ్చారు. ఆమె ఉట్నూర్ పట్టణంలోని అన్ని వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు పలు హామీలు ఇస్తున్నారు.

బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, జిల్లా నాయకులు, మండల నాయకుల సహకారంతో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన కోసం పాటుపడతానని ఆమె ప్రచారంలో ప్రజలకు హామీలు ఇస్తూ ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ ప్రచారంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, బీజేపీ నిర్మల్ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటున్నారు.

Leave a Reply