Utkoor | అయ్యప్పలకు ముస్లిం యువకుడి అన్నదానం

Utkoor | అయ్యప్పలకు ముస్లిం యువకుడి అన్నదానం

మత సామరస్యాన్ని చాటిన ముస్లిం యువకుడు


Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా (Narayanpet District) ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి మాలధారణ చేపట్టిన స్వాములకు అయ్యప్ప స్వామి సన్నిధానంలో బుధవారం ముస్లిం యువకుడు (Muslim young man) మత సామరస్యాన్ని చాటాడు. మాలధారణ చేపట్టిన స్వాములకు అన్నదానం చేశాడు.

ప్రతి ఏడాది అయ్యప్ప మాలధారణ చేపట్టిన స్వాములకు, ముస్లిం యువకుడు (Muslim young man) మొల్ల బాబు అన్నదానం చేస్తారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండడంతో పాటు దైవ కార్యాలు చేపట్టడం వల్ల ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. అనంతరం గురుస్వాములు కార్తీక్ ఆధ్వర్యంలో మొల్ల బాబును ఘనంగా సన్మానించారు.

Leave a Reply