Utkoor | పాద యాత్రన మన్నెంకొండ వెంకన్న సన్నిధికి మహిళలు.

Utkoor | పాద యాత్రన మన్నెంకొండ వెంకన్న సన్నిధికి మహిళలు.
Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : పేదల తిరుపతిగా ఎంతో ప్రఖ్యాతి పొందిన మహబూబ్ నగర్, ఉమ్మడి జిల్లాలో భక్తుల కోరికలు నెరవేర్చే మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి నారాయణ పేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి మహిళలు ఈ రోజు పాదయాత్రన తరలి వెళ్లారు. ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి నామం స్మరిస్తూ ఏడుకొండల వెంకన్న సన్నిధికి చేరుకొని ముందుగా అలివేలు మంగమ్మ దర్శనం చేసుకున్న తర్వాత గుట్టపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు భక్తులు తెలిపారు. పాదయాత్రన కొత్తపల్లి నుండి మహిళలు మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్లడంతో పలువురు భక్తులు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మహిళా భక్తులు ఇందిరా, నర్సమ్మ, అరుణమ్మ, అనురాధ, అఖిల తదితరులు పాల్గొన్నారు.
