Utkoor | అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చు

Utkoor | అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చు

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజల అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చని ఊట్కూర్ ఏఎస్ఐలు సంజీవయ్య, తిమ్మారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ బస్టాండ్, ఎస్బిఐ బ్యాంకు వద్ద ఎస్పీ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వాట్సాప్, ఎస్ఎంఎస్, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే నకిలీ లింకులు, ఓటీపీ షేరింగ్, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ ఆఫర్లు, లాటరీలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఎవరికీ తెలియజేయవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాల నివారణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మహేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply