Utkoor | అర్హులందరికీ అందిస్తాం..
- ఇందిరమ్మఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ
Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర పశుసంవర్ధక పాడి మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం ఓబ్లాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిరుపేద లబ్ధిదారులకు మంజూరైన ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. నిజమైన లబ్ధిదారులు దళారులను ఆశ్రయించకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలన్నారు. లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లిస్తారని నిర్భయంగా ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ వార్డ్ సభ్యులు అంజప్ప, మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్, లక్ష్మీ చంద్రప్ప, నారాయణమ్మ, బి. వెంకటమ్మ, శంక్రప్ప, గోపాల్ గౌడ్, బలింగప్ప, భీమప్ప, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

