Utkoor | వినూత్నంగా సావిత్రిబాయి పూలే జయంతి

Utkoor | వినూత్నంగా సావిత్రిబాయి పూలే జయంతి
Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మగ్దుంపూర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం హెచ్ఎం ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ప్రజలతో కలిసి పాఠశాల ఆవరణలో వినూత్నంగా మొక్కలు నాటి జయంతి వేడుకలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈసందర్భంగా పాఠశాల హెచ్ఎం శివరాజ్, ఆర్టిఐ జిల్లా నాయకులు కొన్నింటి నరసింహులు మాట్లాడుతూ…. చదువుతూనే అభివృద్ధి సాధ్యమని సావిత్రిబాయి పూలే 1837 మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళలకు పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళల చదువు కోసం నిరంతరం కృషి చేశారన్నారు. దేశంలో స్త్రీలు ఉన్నత స్థాయిలో ఉద్యోగ రంగాల్లో ఉండేందుకు సావిత్రిబాయి చేపట్టిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. దేశంలోని ప్రతి మహిళ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని మహిళా విద్య సామాజిక సమానత్వం కోసం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు.
భారతదేశ సామాజిక చరిత్రలో విప్లవాత్మక పోరాటాన్ని చేసి మహిళలు చదువుకోవడంతో పాటు వివిధ రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తూ భావితరాలకు మార్గదర్శకురాలుగా నిలిచిందన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్, అపర్ణ ప్రియాంక, శివ స్వామి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
