Utkoor | పదిలో రాష్ట్ర టాపర్‌గానిలవండి… రూ. 5 లక్షల నగదు పొందండి.

Utkoor | పదిలో రాష్ట్ర టాపర్‌గానిలవండి… రూ. 5 లక్షల నగదు పొందండి.

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : పదో తరగతి వార్షిక పరీక్షల్లో రాష్ట్రంలోనే బిజ్వార్ విద్యార్థులు టాపర్ గా నిలిచి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా అందజేసే ప్రథమ బహుమతి రూ. 5 లక్షల నగదు పొందాలని బిజ్వార్ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, పాఠశాల హెచ్ఎం కిషోర్ కుమార్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నారాయణపేట బ్రాంచ్ మేనేజర్ వెంకటేష్ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో చదువుకో తెలంగాణ బాగా చదవండి అనే గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 -26 విద్యా సంవత్సరంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధిస్తే రూ 5 లక్షల నగదు, ద్వితీయ స్థానం సాధిస్తే రూ.3 లక్షల నగదు అందజేయడంతో పాటు ప్రతి జిల్లా టాపర్ కు రెండు లక్షలు, మండల టాపర్ కు పదివేల నగదు అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి నగదు పొందడంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది రాజ్, రాకేష్, నరేష్ తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply