Utkoor | ఘనంగాగణతంత్ర దినోత్సవవేడుకలు

Utkoor | ఘనంగాగణతంత్ర దినోత్సవవేడుకలు

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని 23 గ్రామపంచాయతీలలో ఈ రోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడల ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా ఆయా పాఠశాలల విద్యార్థులు ప్రముఖుల వేషధారణలో నిర్వహించిన ప్రభాత్ బేరి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఊట్కూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై రమేష్ ముందుగా జాతీయ జెండా ఎగరవేశారు. ఊట్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఎం రేణుక భరత్, తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ చింతా రవి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో కిషోర్ కుమార్, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో గణేష్ రెడ్డి, ఎంఆర్సి కార్యాలయం వద్ద ఎంఈఓ మాధవి, ఊట్కూర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్ సంతోషి, పులిమామిడి ఆసుపత్రి వద్ద డాక్టర్ సాయిరాం జండా ఎగరవేశారు.

సింగిల్ విండో కార్యాలయం వద్ద విండో అధ్యక్షులు ఎం బాల్ రెడ్డి, మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద కోశాధికారి అనిత, మల్లేపల్లి జిపి వద్ద సర్పంచ్ కథలప్ప, పెద్ద జట్రం జిపి వద్ద సర్పంచ్ వాకిటి వెంకటేష్, తిప్రాస్ పల్లి జిపి వద్ద సర్పంచ్ విజయలక్ష్మి వెంకటేష్, పెద్దపోర్లలో జిపి వద్ద సర్పంచ్ కాశమ్మ, బిజ్వార్ జిపి వద్ద సర్పంచ్ అంజయ్య, సమిస్తాపూర్ జిపి వద్ద సర్పంచ్ జయప్రకాశ్ రెడ్డి, ఓబులాపూర్ జిపి వద్ద సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, పగిడిమర్రి జిపి వద్ద సర్పంచ్ జాఫర్, వల్లంపల్లి జిపి వద్ద సర్పంచ్ కస్తూరివాణివెంకట్రాములు, అమీన్ పూర్ జిపి వద్ద సర్పంచ్ నాగేష్ జెండాలు ఎగరవేయగా ఆయా రైతుకు వేదికల వద్ద ఏఈవోలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు జెండాలు ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయా పార్టీల నాయకులు, యువకులు, తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply