Utkoor | ఎల్ వోసీ అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి

Utkoor | ఎల్ వోసీ అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి
Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల పరిధిలోని త్రిప్రాస్ పల్లి గ్రామానికి చెందిన కుర్వ పూజారి శరణప్ప గుండె ఆపరేషన్ కు రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి బాధితుడి కుటుంబ సభ్యులకు శుక్రవారం ఎల్ వోసీ అందజేశారు. శరణప్ప గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆపరేషన్ కోసం రూ. 6 లక్షల ఎల్ వోసీ అందజేసి ఆపదలో నేనున్నానంటూ మంత్రి భరోసా ఇచ్చారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యజ్ఞేశ్వర్ రెడ్డి, ఓబులాపూర్ మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు నరసింహ, ఆంజనేయులు, ఉషప్ప, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.
