Utkoor | ఊరు వాడలో భోగి సంబరాలు

Utkoor | ఊరు వాడలో భోగి సంబరాలు

  • రైతుబంధువేయాలని వినూత్నంగా ముగ్గులు

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పర్వదిన వేడుకల్లో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో భోగి సందడితో ఊరువాడ కళకళలాడింది. భోగి పండుగను పురస్కరించుకొని మహిళలు ఇళ్ళ ముందు వివిధ రకాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిప్రాస్ పల్లి మాజీ సర్పంచ్ సుమంగళ ఇంటి ముందు రైతులకు రైతుబంధు డబ్బులు జమ చేయాలని వినూత్నంగా ముగ్గులు అలంకరించడం విశేషంగా ఆకట్టుకుంది.

భోగి పండుగ పురస్కరించుకొని వివిధ దేవాలయాలు భక్తులతో సందడి నెలకొనగా వేకువ జామున పాత వస్తువులు భోగిమంటల్లో వేసి ఆడిపాడుతూ ఈ ఏడాది అన్ని శుభాలు జరగాలనిఆకాంక్షించారు. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే భోగి వేడుకల్లో భాగంగా పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టి పడినట్లు కళకళలాడుతుంది. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు చేరుకోవడంతో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నారు.

లోగిళ్ళ ముందు మహిళలు వివిధ రకాల రంగులతో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు చిన్నారుల గాలి పతంగులు ఎగరవేస్తూ వేడుకలు వేడుకగా జరుపుకుంటున్నారు. మల్లేపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని సర్పంచ్ కథ లప్ప ఆధ్వర్యంలో వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేస్తున్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా పల్లె పల్లెల్లో సంక్రాంతి సందడి సంతరించుకుంది.

Leave a Reply