Us Destroys : 16 ఇరానీ షిప్స్ మ‌టాష్‌ Andhra Prabha News

Us Destroys : 16 ఇరానీ షిప్స్ మ‌టాష్‌ Andhra Prabha News\

  • హొర్మ‌జ్ అల‌జ‌డి
  • అమెరికా భీక‌ర దాడి
  • మ‌ళ్లీ చ‌మురు మంట‌లు

(ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ )

Us Destroys

హోర్మ‌జ్ జలసంధి స‌మీపంలో అమెరికా ద‌ళాలు రెచ్చిపోయాయి. భార‌త కాలమానం ప్ర‌కారం, బుధ‌వారం తెల్ల వారుజామున 16 ఇరానీ మైన్‌లేయర్ (గని పేల్చే) నౌకలను ధ్వంసం చేసినట్లు అమెరికా ధృవీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , CENTCOM అధికారికంగా ఈ సమాచారాన్ని వెల్లడించారు. 2026 మార్చి 11, తెల్లవారుజామున 01:30 AM నుంచి 02:30 AM (IST) మధ్యలో ఈ భీక‌ర దాడి జ‌రిగింది. అమెరికా కాలమానం ప్రకారం (ET), మార్చి 10 రాత్రి సుమారు 8:00 నుండి 9:00 గంటల సమయంలో ఈ ప్ర‌క‌ట‌న వెలువడింది. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి Strait of Hormuzసమీపంలో ఈ నౌకలను అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. మొదట 10 నౌకలను ధ్వంసం చేసినట్లు ట్రంప్ ప్రకటించగా, ఆ తర్వాత 16 మైన్‌లేయర్ నౌకలను మట్టుబెట్టినట్లు CENTCOM ధృవీకరించింది.

Us Destroys ఇది భీక‌ర దాడి

Us Destroys

ఈ ఆపరేషన్‌ను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ “అత్యంత తీవ్ర దాడులు” (most intense day of strikes) గా అభివర్ణించారు. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్ ఒకవేళ జలసంధిలో గనులను వేస్తే, మునుపెన్నడూ చూడని రీతిలో సైనిక పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని, అక్కడ నౌకలను అనుమతించబోమని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఇరాన్ ఈ ప్రాంతంలో గనులను అమర్చడం వల్ల అంతర్జాతీయ ఇంధన రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతుందని అమెరికా స‌హా మిత్రదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Us Destroys : మ‌ళ్లీ చ‌మురు తంటా

ఈ యుద్ధ వాతావరణం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి, ఇది ప్రపంచ చమురు ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కీలక జ‌లసంధిలో ఇరాన్ సముద్రపు గనులను (mines) అమర్చడానికి ప్రయత్నిస్తోందన్న ఇంటెలిజెన్స్ సమాచారం . అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో అమెరికా నావికాద‌ళం, వైమానిక ద‌ళం పాల్గొన్నాయి. మొత్తం 16 మైన్‌లేయర్ నౌకలతో పాటు ఇతర నావికాదళ నౌకలను క్షిపణులు, డ్రోన్ల తో అమెరికా నాశనం చేసింది.

Us Destroys

Leave a Reply