Urkonda | ఆంజనేయస్వామి ఆలయం హుండీ లెక్కింపు

Urkonda | ఆంజనేయస్వామి ఆలయం హుండీ లెక్కింపు
Urkonda | ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఊరుకొండపేట గ్రామ శివారులో ఉన్న శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ హుండీ లెక్కింపు ఇవాళ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీణాదరి, ఈవో సత్య చంద్రారెడ్డి, చైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రారంభించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో కల్వకుర్తి షిరిడి సాయి సేవ బృందం, పాలక మండలి సభ్యులు ఉర్కొండ సర్పంచ్ మ్యాకల మంజుల శ్రీనివాసులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
