Urea | రైతులకు అందుబాటులో యూరియా….

Urea | రైతులకు అందుబాటులో యూరియా….

  • వ్యవసాయ శాఖ ప్రత్యేక అధికారి శైలజ….

Urea | బిక్కనూర్, ఆంధ్రప్రభ : రైతులకు కావలసిన యూరియా అందుబాటులో ఉంచామ‌ని వ్యవసాయ శాఖ ప్రత్యేక అధికారి శైలజ చెప్పారు. ఇవాళ‌ మండలంలోని జంగంపల్లి గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని తనిఖీ చేశారు. అక్కడ యూరియా(Urea) అమ్మకాలను ఆమె పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ… నిర్దేశించిన పరిమాణం కంటే ఎక్కువ యూరియాను విక్రయించవద్దని ఆదేశించారు. తగినంత యూరియా నిలువలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సొసైటీల్లో యూరియాను అందుబాటులో ఉంచడం జరిగిందని ఆమె చెప్పారు. ఆమె వెంట కామారెడ్డి జిల్లా(Kamareddy District) వ్యవసాయశాఖ అధికారి మోహన్ రెడ్డి, ఏడీఏ అపర్ణ, మండల వ్యవసాయ అధికారి నరేంద్ర, వ్యవసాయ విస్తీర్ణ అధికారి లిఖిత్ రెడ్డి, సొసైటీ సిబ్బంది, రైతులు ఉన్నారు.

Leave a Reply