- పోలీస్ పహారాలో యూరియా పంపిణీ
నర్సింహులపేట, ఆగస్టు19(ఆంధ్రప్రభ): మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలంలో యూరియా (urea) దొరక్క అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా రైతులకు సరిపడా అందుబాటులో లేక అష్టకష్టాలు పడుతున్నారు. మంగళవారం రైతులు (Farmers) డీలర్ల దుకాణాల వద్ద బారులు తీరారు. మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు యంత్రాంగం పహారాలో రైతులకు ప్రతి ఒక్కరికి రెండేసి చొప్పున క్యూలో నిలబెట్టి గొడవలు లేకుండా పంపిణీ చేస్తున్నారు.
ప్రైవేట్ డీలర్లు (Private dealers) యూరియాను నిల్వ ఉంచారని కొంతమంది రైతులు ఆందోళనకు దిగడంతో స్పందించిన అధికారులు, స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు (Agriculture Department officials) వినయ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి తహసిల్దార్ రమేష్ బాబు, ఎస్ఐ సురేష్ లు డీలర్ల దుకాణాల్లో నిల్వ ఉంచిన యూరియాను తనిఖీ చేసి రైతులకు నచ్చజెప్పి గొడవలకు తావు లేకుండా పంపిణీ చేశారు.నానో యూరియాను రైతులు వాడుకోవాలని సూచించారు.