Urdu Bhavan | జర పట్టించుకోండి సారూ..

Urdu Bhavan | జర పట్టించుకోండి సారూ..
- లక్షలు వెచ్చించారు.. లక్ష్యం మరిచారు
- నిరుపయోగంగా ఉర్దూ భవన్
- పట్టించుకోని అధికారులు, మైనార్టీ నాయకులు
Urdu Bhavan | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మైనార్టీల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2009లో అప్పటి మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ మంత్రి ఎల్కోటి ఎల్లారెడ్డి సహకారంతో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఎంతో ఆర్భాటంగా నిర్మించిన ఉర్దూ భవన్ నిరుపయోగంగా ఉంది. ఈ భవనాన్ని నలుగురు మంత్రులు ఎల్కోటి ఎల్లారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, చంద్రశేఖర్, కోడెల శివప్రసాదరావు 2009లో ప్రారంభించారు.
మైనార్టీలు వివిధ శుభకార్యాలు సమావేశాలు చేపట్టేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం గద్వాల గేరివీధిలో రూ. 3 లక్షలతో ఉర్దూ భవన్ నిర్మించారు. ఉర్దూ భవన్లో మైనార్టీల సంక్షేమం కోసం సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు లైబ్రరీ కంప్యూటర్, విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యంతో నిర్మించారు. అధికారులు, మైనార్టీ నాయకులు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారడంతో పాటు గేటు కిటికీలు ధ్వంసమై మందుబాబులకు అడ్డాగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉపయోగంలోకి తీసుకురావాలి : దేశాయిముజాహిద్, మైనార్టీ నాయకుడు, ఊట్కూర్

మైనార్టీల అభ్యున్నతి కోసం గత టీడీపీ హయాంలో నిర్మించిన ఉర్దూ భవనం ఉపయోగంలోకి తీసుకురావాలని మైనార్టీ నాయకుడు దేశాయి ముజాహిద్ కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా నిరుపయోగంగా ఉండడంతో పాటు కిటికీలు గేటు బండలు ధ్వంసo మయ్యయాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఉర్దూ భవనం ఉపయోగం లోకి తీసుకురావాలని కోరారు.
