HYD | దసరాలోపు ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవ‌ర్ ను పూర్తి చేయిస్తా : మంత్రి కోమటిరెడ్డి

మేడిపల్లి, జులై 16(ఆంధ్రప్రభ) : ఉప్పల్ -నారపల్లి (Uppal -Narapalli) ఎలివేటడ్ కారిడార్ ఫ్లై ఓవర్ ను దసరా వరకు పూర్తి చేయిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) హామీ ఇచ్చారు. బుధవారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ మేడిపల్లి (Medipalli) వద్ద ఎలివేటడ్ కారిడార్ ఫ్లై ఓవర్ (Elevated Corridor Flyover) పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… టెక్నికల్ సమస్యల మూలంగా ఫ్లై ఓవర్ పనులకు జాప్యం జరిగిందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసన్నారు. ట్రాఫిక్ సమస్య, వాహన దారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లై ఓవర్ కింద రోడ్డు పనులు చేపట్టినట్లు తెలిపారు. దసరా పండుగ లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పనులు ప్రారంభమ‌య్యాయని యుద్దప్రాతిపధకన బ్రిడ్జ్ పనులు జరుగుతాయని పేర్కొన్నారు.

Leave a Reply