రోడ్డు ప్రమాదంలో 16 మంది సిక్కోలు క్షతగాత్రులు .. కేంద్ర మంత్రి పరామర్శ

రోడ్డు ప్రమాదంలో 16 మంది సిక్కోలు క్షతగాత్రులు .. కేంద్ర మంత్రి పరామర్శ

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) వాసులు తీవ్రంగా గాయపడ్డారు. కాశీ తో పాటు పలు తీర్ధ యాత్రలకు పలాస, బ్రాహ్మణతర్ల, కోటబొమ్మాళి ప్రాంతాలనుండి ప్రైవేటు బస్సులో బయలుదేరారు. గురువారం యూపీ రాష్ట్రం జాన్పూర్(Jaunpur) జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న బస్సును లారీ ఢీ కొనడంతో జిల్లాకు చెందిన 16 మంది ప్రయాణీకులు గాయపడ్డారు.

గాయపడ్డ వారిని చికిత్స కోసం జాన్పూర్, వారణాసి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని గురువారం రాత్రి అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. ఈ ప్రమాదఘటన సమాచారం తెలుసుకున్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహనానాయుడు(Kinjarapu Rammohan Naidu) వెంటనే స్పందించి గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జాన్పూర్,వారణాసి ఆసుపత్రుల వైద్యులకు ఆదేశించారు. వైద్యులతో అయన ఫోన్ లో మాట్లాడారు. ఎయిర్పోర్ట్ అధారిటీ(Airport Authority) అధికారులతో కూడా అయన మాట్లాడి అవసరమైన వైద్య సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డిల్లీ లో ఉన్న రామ్మోహన్ నాయుడు.

క్షతగాత్రుల ఆరోగ్యం పట్ల స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదించారు. క్షతగాత్రులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అత్యవసర వైద్య సహాయం అందించడంతో గాయపడిన వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని,. క్షతగాత్రులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.

Leave a Reply