క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌

క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌

సముద్రం కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర‌మంత్రి రామ్మోహన్ నాయుడు
త్వరితగత పరిష్కారానికి ఆదేశం


శ్రీకాకుళం, నవంబర్ 5 (ఆంధ్రప్రభ బ్యూరో) : శ్రీకాకుళం మండలం పెద్దగనగల్లవానిపేట మత్స్యకార గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) బుధవారం పర్యటించారు. నాగావళి నది సముద్రంలో కలిసే ఈ ప్రాంతంలో తీరం కోతకు గురవుతోందని తెలుసుకున్న రామ్మోహన్ నాయుడు.. అందుకు గల పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

నాగావళి నది సముద్రంలో కలిసే దిశను మార్చుకుంటూ వెళ్ళడం ప్రమాదకరమని గుర్తించిన కేంద్ర మంత్రి అందుకు నివారణ మార్గాలను అధికారులకు సూచించారు. అంతకుముందు పెద్ద గనగల్లవానిపేట తీరం సమీపంలో కేంద్ర ప్రభుత్వ నిధులు కోటి నలభై లక్షలతో నిర్మించనున్న స్టోరేజ్ షెల్టర్ భవనానికి ఎమ్మెల్యే గొండు శంకర్ (MLA Gondu Shankar) తో కలసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… పెద్దగనగల్లవానిపేట ప్రాముఖ్యమైన గ్రామం అని.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కోస్టల్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చిన సూచనల మేరకు నది దిశను యథావిధిగా ఉంచే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు సమాంతరంగా రెండవ దశలో ఈ ప్రాంతంలో ఫిషింగ్ జెట్టి కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక మత్స్యకారులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply