సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి ఆదేశం
కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : జిల్లాలోని కోటబొమ్మాళి మండల కేంద్రం టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుతో కలసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజలు తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై సంబంధిత అధికారుల దృష్టికి చేరవేసి సత్వర పరిష్కారానికి అదేశించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల ద్వయానికి తమ సమస్యను చేరవేసిన జిల్లా వాసులు.. వెంటనే లభించిన భరోసాతో ఆనందం వ్యక్తం చేశారు.

శివాలయంలో అభిషేకాలు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : కార్తీక సోమవారం సందర్భంగా శ్రీకాకుళం నగరం, పెద్దపాడులో కొలువై ఉన్న మృత్యుంజయశ్వర ఆలయానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్లి దర్శించుకుని, అభిషేకాలు, పూజలు చేశారు.

