కాసిపేట, మార్చి 7 (ఆంధ్రప్రభ) : కాసిపేట పొలీస్ స్టేషన్ భరత్ కాలనీ సోమగూడెం, దేవాపూర్ గ్రామం వైపు వెళ్లే రోడ్డు పక్కన, ఆటో స్టాండ్ దగ్గరలో, దాదాపు 45ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు, శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తిని గుర్తించిన ఎవరైనా వ్యక్తులు 8712656571 కు ఫోన్ చేయాలని, లేదా పొలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ కోరుతున్నారు.
ADB | గుర్తు తెలియని వ్యక్తి మృతి
