Unemployees | నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

అప్లికేషన్ డెవలపర్ – వెబ్ & మొబైల్ కోర్సులో ఉచితంగా శిక్షణ
ఎమ్మెల్యే కాగిత కృష్ణ

Unemployees | పెడన – ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ద్వారా బీటెక్, డిప్లొమా, బీఎస్సీ, బీకామ్ చదివిన నిరుద్యోగ అభ్యర్థులకు స్థానిక స్కిల్ హబ్‌లో అప్లికేషన్ డెవలపర్ – వెబ్, మొబైల్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణ ఆదివారం తెలిపారు.

స్థానిక యువత ఐటీ కోర్సుల శిక్షణ కొరకు పెద్ద నగరాలకు వెళ్లే అవసరం లేకుండానే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే ఐటీ కోర్సులపై శిక్షణ పెడనలో ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా స్థానిక స్కిల్ హబ్‌లో మొదటగా అప్లికేషన్ డెవలపర్ వెబ్ & మొబైల్ 3 నెలల కోర్స్ లో శిక్షణ ప్రారంభిస్తున్నట్లు, దీనికి సంబంధించి బీటెక్, డిప్లొమా, బీఎస్సీ, బీకామ్ చదివి వయసు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని, శిక్షణ అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోర్స్ గుర్తింవు సర్టిఫికెట్ ప్రదానం చేస్తారని, శిక్షణ అనంతరం ఉపాధికి తగిన సహకారంతో పాటు, గుర్తింపు గల ఈ కోర్స్ శిక్షణతో నాస్స్కమ్ సభ్యత్వం గల ఐటీ కంపెనీలలో సులువుగా ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు.

డిసెంబర్ 1 నుండి ప్రారంభమయ్యే ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం అర్హులైన ప్రతి ఒక్క నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని, సమాచారం కోసం స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ 8897772488 నందు సంప్రదించాలని శాసన సభ్యుల కార్యాలయం ఒక ప్రకటనలో కోరారు.

Leave a Reply