SOIL TEST | భూసార పరీక్షలపై అవగాహన

SOIL TEST | ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ :మండలం విద్యార్థులకు నేల ఆరోగ్యలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం నందు పీఎంఎస్ హెచ్‌ఆర్‌ఐ ఎస్ హెచ్ ఆర్ ఐ – ఎస్ ఎస్ హెచ్ పి పథకం కింద పాఠశాలలో శనివారం భూసార పరీక్షలపై మండల వ్యవసాయ అధికారి శివశంకర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నేల ఆరోగ్యం, భూసార పరీక్షల ఆవశ్యకత, మట్టి నమూనాలను తీసే పద్ధతిని చూపించి, పరీక్షల వల్ల కలిగే లాభాలను వివరించారు.

పీఎం శ్రీ – ఎస్ఎస్ హెచ్‌పీ ప్రోగ్రామ్ కింద విద్యార్థులు 50 మట్టి నమూనాలను సేకరించి విద్యార్థులే పరీక్ష చేసేలా కేంద్ర ప్రభుత్వం కిట్లను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రహిమాన్ భాష , సైన్స్ టీచర్ హరీష్ కుమార్, భూసార పరీక్షా కేంద్రంలో పనిచేస్తున్నవ్యవసాయ సహాయ సంచాలకులు పి.అశోక్ వర్ధన్ రెడ్డి, వ్యవసాయ అధికారులు ఇందుమతి, నవీన, లావణ్య, కిరణ్ కుమార్, కె.వి.కె బనవాసి శాస్త్రవేత్త తేజ, ఏటీఎం రామాంజినేయులు పాల్గొన్నారు.
