U19 world cup|బుడ్డోడి విధ్వంసం

U19 world cup|బుడ్డోడి విధ్వంసం

U19 world cup| 80 బంతుల్లో 175 ప‌రుగులు

  • అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌
  • భారీ స్కోర్ దిశ‌గా యువ భార‌త్‌

U19 world cup
U19 world cup

వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త్‌, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ తుది పోరులో భార‌త్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త ఓపెన‌ర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అద్భుత శతకంతో కదం తొక్కాడు. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ బాదిన అతని పిన్న వయస్కుడు కూడా వైభవ్ సూర్యవంశీ కావడం గమనార్హం. 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు.

కేవలం 55 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. చివ‌ర‌గా 80 బంతుల్లో 175 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ భారీ శ‌త‌కంలో అత‌ను 15 ఫోర్లు, 15 సిక్సులు బాది విధ్వంసం సృష్టించాడు. పలుమార్లు బంతి స్టేడియం బయటికి వెళ్లిందంటే సూర్యవంశీ ఎంత పవర్ ఫుల్ షాట్లు కొట్టాడో అర్థమవుతుంది. దాదాపు 190 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్ బౌలింగ్‌ను చిన్నాభిన్నం చేశాడు. దీంతో భార‌త యువ జ‌ట్లు భారీ స్కోరు దిశ‌గా దూసుకెళ్తుంది. ఇక ఓవ‌రాల్‌గా అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్యంత వేగంగా సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్ల జాబితాలో వైభ‌వ్ రెండో స్థానంలో నిలిచాడు. విల్ మలాజ్‌జుక్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన అత‌డు ఈ ఎడిష‌న్‌లోనే జ‌పాన్ పై 51 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు.

అండ‌ర్‌19 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీలు
51 – విల్ మాలాజ్కుక్ (ఆస్ట్రేలియా) vs జపాన్, విండ్‌హోక్, 2026
55 – వైభవ్ సూర్యవంశీ (భారత్) vs ఇంగ్లాండ్, హరారే, 2026
63 – ఖాసిం అక్రమ్ (పాకిస్తాన్) vs శ్రీలంక, నార్త్ సౌండ్, 2022
65 – బెన్ మేయెస్ (ఇంగ్లండ్) vs స్కాట్లాండ్, హరారే, 2026
69 – రాజ్ బావా (భారత్) vs ఉగాండా, టరూబా, 2022

ఫైనల్లో టాప్ స్కోర‌ర్‌..
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా కూడా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. ఈ ఫీట్ సాదించిన మూడో భారత బ్యాటర్‌గా కూడా వైభవ్ నిలిచాడు. అతని కంటే ముందు ఉన్మక్త చంద్(111), మన్జోత్ కల్రా(101) ఫైనల్లో భారత్ తరఫున శతకాలు నమోదు చేశారు. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా వైభవ్ సూర్యవంశీ రికార్డుకెక్కాడు.

అండ‌ర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్‌లో సెంచరీలు
175 – వైభవ్ సూర్యవంశీ (భారత్) vs ఇంగ్లాండ్, హరారే, 2026
111* – ఉన్ముక్త్ చంద్ (భారత్) vs ఆస్ట్రేలియా, టౌన్స్‌విల్లే, 2012
108 – బ్రెట్ విలియమ్స్ (ఆస్ట్రేలియా) vs పాకిస్తాన్, అడిలైడ్, 1988
107 – స్టీఫెన్ పీటర్స్ (ఇంగ్లాండ్) vs న్యూజిలాండ్, జోహన్నెస్‌బర్గ్, 1998
101* – మన్జోత్ కల్రా (భారత్) vs ఆస్ట్రేలియా, మౌంట్ మౌంగనుయ్, 2018
100* – జరాడ్ బుర్కే (ఆస్ట్రేలియా) vs సౌత్ ఆఫ్రికా, లింకన్, 2002

Leave a Reply