unanimity | సర్పంచ్ ల మండల అధ్యక్షుడిగా…

unanimity | సర్పంచ్ ల మండల అధ్యక్షుడిగా…
- భాగ్యమ్మ ఫుల్ సింగ్ నాయక్
unanimity | వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా మర్రి గుంత తండా సర్పంచ్ వర్త్యావత్ భాగ్యమ్మ ఫుల్ సింగ్ నాయక్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్ లు సమావేశమై భాగ్యమ్మ ఫుల్ సింగ్ నాయక్ లను ఎన్నుకున్నట్టు తెలిపారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదేశాల మేరకు సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ పోటీలో ఉండగా వారిని బుజ్జగించి భాగ్యమ్మ ఫుల్ సింగ్ నాయక్ ని బలపరిచినట్టు తెలిపారు. మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఉపాధ్యక్షులుగా బండోన్పల్లి సర్పంచ్ సంగీత, పెద్దాపూర్ సర్పంచ్ కేశమళ్ళ అనూష కృష్ణ, బైరాపూర్ సర్పంచ్ మంజుల రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రాచూర్ సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారిని శాలువాలతో సన్మానించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్, పర్వత్ రెడ్డి, భూపతి రెడ్డి, గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
